Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ - సుక్కు సినిమా కథ లీక్.. సోషల్ మీడియాలో హల్‌చల్

మెగా పపర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను యూనిట్ విడుదల చేసింది. కాడెత్తుకుని వెళుతున్న రాంచరణ్‌ పోస్టర్ నెట్‌లో వైర

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (17:35 IST)
మెగా పపర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను యూనిట్ విడుదల చేసింది. కాడెత్తుకుని వెళుతున్న రాంచరణ్‌ పోస్టర్ నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమాకు 'రేపల్లె' లేదా 'పల్లెటూరి ప్రేమలు' అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు సమాచారం. అయితే సుకుమార్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తోంది. సుకుమార్ తీయాలనుకుంటున్న కథ నెట్‌లో లీకయిందంటూ ప్రచారం జరుగుతోంది.
 
కథ ఇదేనంటూ ఓ స్క్రిప్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం సినిమా కథేంటంటే... హీరో పక్కా పల్లెటూరి కుర్రాడు. అందరితో కలిసిమెలిసి ఉంటుంటాడు. అలాంటి యువకుడు అనుకోకుండా ఓ పని మీద సిటీకి వెళ్లాల్సొస్తుంది. సిటీలోనే ఓ ప్రయోగశాలలో పనికి కుదురుతాడు. అక్కడున్న శాస్త్రవేత్తలు మనిషిపై ఓ ప్రయోగం చేయాలన్న దుర్భుద్దితో ఉంటారు. 
 
ఈ యువకుడిపై వారి కన్నుపడుతుంది. ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు హీరోపై ప్రయోగం చేశారా? ఒకవేళ చేస్తే ఆ తదనంతరం జరిగిన పరిణామాలేంటి అనే విషయాలను సుకుమార్ ఆసక్తికరంగా తెరకెక్కించనున్నాడని టాక్. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే. ఒక స్టార్ హీరోతో ఓ క్రియేటివ్ డైరెక్టర్ సినిమా తీయాలనుకున్నప్పుడు ఇలాంటి కథలు తెరపైకి రావడం కొత్తేమీ కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments