Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధృవ'కు 'పంజా' దెబ్బ తగిలేనా.. రామ్ చరణ్‌ను వెంటాడుతున్న పవన్ సెంటిమెంట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి పంజా దెబ్బ తగులుతుందనే భయం వెంటాడుతోంది. అంటే సినిమా విడుదల కూ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (12:57 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి పంజా దెబ్బ తగులుతుందనే భయం వెంటాడుతోంది. అంటే సినిమా విడుదల కూడా రామ్ చరణ్‌ను హీరో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
పవన్ కళ్యాణ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 2011లో వచ్చిన చిత్రం 'పంజా'. ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదలైంది. ఈ సినిమా పవన్ సినిమాలలో భయమకరమైన ఫ్లాప్‌గా మిగాలడమే కాకుండా పవన్ అభిమానులకు కూడ తీవ్ర నిరాశపరిచింది. దీనితో యాదృచ్ఛికంగా అదే ఫెయిల్యూర్ డేట్‌ను ఎంచుకుని ఐదు సంవత్సరాల తర్వాత అదే కుటుంబానికి చెందిన మరో మెగా హీరో సినిమా విడుదలవుతోంది. 
 
ఈ తేదీ ఖచ్చితంగా రామ్ చరణ్‌కు కూడా షాక్ ఇస్తుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ మెగా కాంపౌండ్‌కు గుబులు పుట్టిస్తున్నాయి. వాస్తవానికి చరణ్ 'ధృవ'ను డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. అయితే అనుకోకుండా ఏర్పడిన ఈ కరెన్సీ కష్టాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 9కి మార్చారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఆ డేట్ చరణ్ 'పంజా' రిలీజ్ డేట్‌తో మ్యాచ్ కావడంతో చరణ్ వ్యతిరేకులు కొందరు 'పంజా' ఫెయిల్యూర్‌ను గుర్తుకు చేస్తూ మెగా కాంపౌండ్‌పై జోక్స్ వేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Salary Cut : జగన్మోహన్ రెడ్డి జీతంలో కోత లేదా సస్పెన్షన్ తప్పదా?

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న

ప్రతి ఒక్కరూ చక్కెర - ఉప్పు - నూనె తగ్గించుకోండి.. సీఎం చంద్రబాబు సూచన

ఫేక్ ప్రచారం.. వైకాపా నేత భూమనకు పోలీసుల నోటీసు

శబరిమల అభివృద్ధికి రూ.70.37 కోట్లు ఖర్చు చేశాం-వాసవన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments