రామ్ చరణ్ 'రౌడీ తమ్ముడు'.. మరొకటి కూడా...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (21:43 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే... ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. మొన్నటి వరకు స్టేట్ రౌడీ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. 
 
మెగా కాంపౌండ్ కావాలనే ఈ టైటిల్‌ను లీక్ చేసిందట‌. ఈ టైటిల్‌కి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు 2 టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈసారి ఓ మాస్ టైటిల్, మరో క్లాస్ టైటిల్ బయటకొచ్చాయి. మాస్ టైటిల్ విషయానికొస్తే.. రౌడీ తమ్ముడు అనే టైటిల్  వినిపిస్తోంది. స్టేట్ రౌడీ అనే టైటిల్‌లో రౌడీకి, పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు టైటిల్ లింక్ చేసి పెట్టారన్నమాట. 
 
సినిమాలో చరణ్‌ది ఇద్దరు అన్నలకు తమ్ముడి పాత్ర. అందుకే ఇలా పెట్టార‌ని తెలిసింది. ఇక క్లాస్ టైటిల్ విష‌యానికి వ‌స్తే... ఆ టైటిల్ పేరు వినయ విధేయ రామ. బెల్లంకొండ సినిమాకు జయజానకి నాయక అనే పేరుపెట్టినట్టు, చరణ్ సినిమాకు ఇలా క్లాసీగా వినయ విధేయ రామ అనే పేరు ఫిక్స్ చేశాడట బోయపాటి. ప్రస్తుతానికి ఈ రెండు టైటిల్స్‌ను బయటకు వదిలారు. ఈ రెండింటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments