Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరణ్-కొరటల శివ కాంబినేషన్లో సినిమా?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (23:24 IST)
చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్టయినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేనషన్లో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ - వివి వినాయక్ ముఖ్య అతిథులుగా ఓ ప్రాజెక్టు స్టార్టయ్యింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది.
 
వీళ్లిద్దరూ ఎవరి ప్రాజెక్టులో వారు బిజీ అయిపోయారు. ప్రస్తుతం కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు కలసి  సంయుక్తంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆచార్య సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
 
చిరు 152వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అదే సమయంలో కొరటాల శివ నెక్స్ట్ అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం 'ఆచార్య' తో పాటు బన్నీతో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత కొరటాల శివ..రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కొరటాల స్నేహితుడొకరు నిర్మాతగా వ్యవహరించనున్నారట. కొరటాల త్వరలో స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి చరణ్‌కి వినిపించనున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు నాయుడు

ఫ్యాన్సీ నంబర్ వేలం- TG09G9999 రూ.25.5లక్షలకు కొనుగోలు

ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు.. మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ

ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్

SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments