Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటుందని నాకు తెలియదు : రకుల్ ప్రీత్ సింగ్

భారతీయ చిత్రపరిశ్రమలో తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఒకటుందనే విషయం తనకు అస్సలు తెలియదని టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉంది. కానీ, ఈమె చేస

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (11:55 IST)
భారతీయ చిత్రపరిశ్రమలో తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది ఒకటుందనే విషయం తనకు అస్సలు తెలియదని టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఉంది. కానీ, ఈమె చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ ప్రముఖులు ఖంగుతిన్నారు. 
 
కాలేజ్‌లో ఉండగానే మోడలింగ్‌ చేసిన రకుల్‌.. 19 ఏళ్లకే వెండితెర అరంగేట్రం చేసింది. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో విజయం అందుకున్నా.. మరో రెండేళ్ల వరకు ఆమెకు అవకాశాలు పెద్దగా దక్కలేదు. ఆ సమయంలో ఏం జరిగిందనేది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 
తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కూడా ఇక్కడకు వచ్చే వరకు తనకు తెలియదన్నారు. అలాంటి టైమ్‌లో పాకెట్‌ మనీ కోసం ఓ కన్నడ సినిమా చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత 'కెరటం' అనే సినిమాలో ఓ ఐదు నిమిషాల రోల్‌ చేశాను. 
 
అనంతరం నటనపై పెరిగిన ఇష్టంతో ప్రభాస్ సరసన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. కానీ, నాలుగు రోజుల షూటింగ్‌ తర్వాత నన్ను తీసేశారు. కారణం నాకు ఇప్పటికీ తెలియదని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments