Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ సినిమా నుంచి రకుల్ అవుట్.. కోటి రూపాయల పారితోషికం సంగతేంటి?

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పారితోషికాన్ని బాగా పెంచేసిందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా షికార్లు చేస్తున్నాయి. తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రక

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:49 IST)
టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పారితోషికాన్ని బాగా పెంచేసిందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా షికార్లు చేస్తున్నాయి. తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రకుల్ అక్కడ కూడా ఛాన్సుల్ని పట్టేస్తోంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కోటి పారితోషికం అందుకుందట. ప్రస్తుతం మహేష్-మురగాదాస్ చిత్రంతో పాటు.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరణ్ తేజ్ హీరో తెరకెక్కుతోన్న సినిమాలోనూ నటిస్తోంది. 
 
మరోవైపు, రాంచరణ్ ''ధృవ'' షూటింగ్‌ని పూర్తి చేస్తోంది. విశాల్ సరసన నటించిన ఓ తమిళ చిత్రానికి రకుల్ ప్రీత్ సింగ్ కోటి రూపాయలు తీసుకుందట. అయితే ఇప్పుడు విశాల్ సినిమా నుండి రకుల్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ''తుప్పరివాలన్'' అనే ఈ సినిమాకు రకుల్ ముందుగానే డేట్స్ ఇచ్చేసింది. అయితే విశాల్ కొన్ని ప్రాజెక్ట్సు‌తో బిజీ కావడంతో తనకు తగిన విధంగా రకుల్ డేట్స్‌ను మార్చుకోలేకపోతోంది. అలా చేస్తే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఆ ప్రాజెక్ట్ నుండి బయటకి వచ్చేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ సినిమా పోతే ఏంటి..? విక్రమ్ సినిమా ఉంది కదా అనే ధీమాలో అమ్మడు ఉందని సమాచారం. ఇంతటీ బిజీలో విశాల్ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని ముద్దుగుమ్మ సన్నిహితుల దగ్గర వాపోతోందట. గతంలోనూ మహేష్ సినిమాలో ఆఫర్ వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా వదిలేసుకొన్న విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments