మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ

''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జ

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (11:18 IST)
''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జంట.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 
 
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య చైతూ-రకుల్‌కి ఓ కథ వినిపించిందని.. ఆ కథ కొత్తగా వుండటంతో ఇద్దరూ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు-మూడు తమిళ సినిమాలు రకుల్ చేతిలో వున్నాయి. ఇక నాగచైతన్య ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్, లడాఖ్ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్రబిందువు

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్​కు ఊరట

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments