Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్, శ్రుతి, తమన్నా.. ఇప్పుడేమో రకుల్ కావాలంటోన్న అక్షయ్ కుమార్

దక్షిణాది ముద్దుగుమ్మలు అసిన్, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, తమన్నాలకు పిలిచి అవకాశం ఇచ్చిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. తాజాగా ఢిల్లీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం ఇచ్చారని తెలిసింది. తెలుగు, తమ

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (14:28 IST)
దక్షిణాది ముద్దుగుమ్మలు అసిన్, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, తమన్నాలకు పిలిచి అవకాశం ఇచ్చిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. తాజాగా ఢిల్లీ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం ఇచ్చారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని  కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇటీవల తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తీతో ఒక సినిమా చేసిన రకుల్, తాజాగా సూర్య సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆఫర్ కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. 
 
ఇప్పటికే హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటించిన చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా అలరించింది. ప్రస్తుతం అక్షయ్‌తో సినిమా చేసేందుకు సై అంటోంది. మరి ఈ సినిమా రకుల్‌‍కు ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments