Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు జారుకున్నారు... కబాలి 'కత్తి'లా ఉంటుందా...? 'సుత్తి'లా ఉంటుందా...?

రజనీకాంత్‌ 'కబాలి' సినిమా తెలుగు హక్కులు పొందేందుకు పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లే లైన్లో వున్నారు. గత కొద్దిరోజులుగా ఈ హక్కుల కోసం తర్జనభర్జనలు జరుగుతూనే వున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు ఈ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (14:15 IST)
రజనీకాంత్‌ 'కబాలి' సినిమా తెలుగు హక్కులు పొందేందుకు పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లే లైన్లో వున్నారు. గత కొద్దిరోజులుగా ఈ హక్కుల కోసం తర్జనభర్జనలు జరుగుతూనే వున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు ఈ చిత్రం కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే... తమిళ నిర్మాతలు పెద్ద రేటు చెప్పడంతో.. తటపటాయిస్తున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అయితే ఈరోజు ఫైనల్‌గా... దిల్‌రాజు.. పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. 
 
పెద్ద పోటీ మధ్య షణ్ముక పిక్చర్స్‌ 'కబాలి' తెలుగు రిలీజ్‌ హక్కులను సొంతం చేసుకుంది. షణ్ముక పిక్చర్స్‌పై భారీ మొత్తానికి ప్రవీణ్‌ చౌదరి ఈ హక్కులను కొనుగోలు చేశారు. దర్శకుడు రంజిత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం సమకూర్చారు. అన్ని భాషల్లోనూ థింక్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదల కానున్న ఆడియో, ఈ నెల 12న మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇక సినిమా జూలై 1న విడుదల కానుంది.
 
ఇదిలావుంటే సహజంగా దిల్ రాజు ఏ చిత్రాన్నయినా వదులుకున్నారంటే వాటిలో చాలామటుకు రెడ్ మార్కులు పడుతాయి. ఈ నేపధ్యంలో కబాలి చిత్రాన్ని దిల్ రాజు వదులుకోవడంతో కబాలి కత్తిలా ఉంటుందా...? సుత్తిలా ఉంటుందా...? అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు సెంటిమెంట్లను నమ్ముతున్న కొంతమంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments