Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 ఎకరాలు కొన్న రాజమౌళి... ఫ్యామిలీకి గిఫ్టుగా ఫామ్ హౌస్...

బాహుబలి చిత్రంతో తెలుగు సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి 100 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ 100 ఎకరాలు హైదరాబాదుకు దూరంగా వున్న దొనకొండలో కొన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ చక్క

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (12:07 IST)
బాహుబలి చిత్రంతో తెలుగు సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి 100 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ 100 ఎకరాలు హైదరాబాదుకు దూరంగా వున్న దొనకొండలో కొన్నట్లు తెలుస్తోంది.  ఇందులో ఓ చక్కటి ఫామ్ హౌస్ కట్టుకుని సేద తీరాలని రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ కల ఇప్పటిది కాదనీ, ఎన్నో ఏళ్ల నుంచి ఇలా తను అనుకున్నట్లు 100 ఎకరాల్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడి వాతావరణంలో కాలం గడపాలనుకునేవారట. 
 
బాహుబలి చిత్రంతో ఆ కల నెరవేరబోతోంది. తను కొనుగోలు చేసిన ఈ పొలంలో మామిడి, సపోటా చెట్లు వున్నట్లు తెలుస్తోంది. ఆ చెట్లను అలాగే వుంచేసి పొలంలో ఓ పక్కన వున్న కొండ ప్రాంతం అంచున ఫామ్ హౌసును నిర్మించాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం. 
 
ఈ నిర్మాణం కోసం చక్కని డిజైన్ ఇవ్వాల్సిందిగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు రాజమౌళితో పాటు కీరవాణి, రాజమౌళి స్నేహితుడు సాయి కొర్రపాటిలు కూడా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారట. మొత్తమ్మీద రాజమౌళి ఫామ్ హౌస్ ఆలోచనతో దొనకొండ ప్రాంతం ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments