Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'ప్రజల మనిషి'... ఆయన కోసం కథ రాస్తున్నా... రాజమౌళి తండ్రి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా కంటే కూడా వ్యక్తిగా తనకు ఎంతో ఇష్టమని సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు... పవన్ కళ్యాణ్ తను అనుకున్న మార్గాన్ని తప్పకుండా మ

Webdunia
సోమవారం, 29 మే 2017 (18:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా కంటే కూడా వ్యక్తిగా తనకు ఎంతో ఇష్టమని సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు... పవన్ కళ్యాణ్ తను అనుకున్న మార్గాన్ని తప్పకుండా ముందుకు సాగుతారనీ, ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొనే తత్వం చూస్తే ముచ్చటేస్తుందని అభిప్రాయపడ్డారు. 
 
అలాంటి వ్యక్తి తను అనుకున్నది సాధించేందుకు ఎంతదూరమైనా వెళతారని అన్నారు. అలాంటి ప్రజల మనిషి కోసం ఓ కథను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. మరి ఈ కథ పవన్ కళ్యాణ్ కు వినిపిస్తే, ఆ కథ నచ్చితే దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రశ్న. 
 
కాగా విజయేంద్ర ప్రసాద్ కథ మామూలుగా వుండదు, అది కూడా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో వున్న ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని కథ రాసే అవకాశం వుంటుంది. అదే జరిగితే, ఆ కథనే తెరకు ఎక్కిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో మైలేజి పెరగడం ఖాయం. విజయేంద్ర ప్రసాద్ అన్నట్లే పవన్ కళ్యాణ్ ఎక్కడికో వెళ్లడమూ ఖాయమే. మరి ఇది 2019 లోపే జరుగుతుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments