Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రష్మి గ్లామర్‌పై హీరో రాజ్ తరుణ్ కన్ను

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో రాజ్‌ తరుణ్‌కు ఈ మధ్య వచ్చిన ఫ్లాప్ ఈ యంగ్ హీరో స్పీడ్‌కు బ్రేక్ వేసింది. దీనితో రాజ్ తరుణ్ తన సినిమాల ఎంపికలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ తన ఇమేజ్ మరింత పడిపోకుండా చ

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:36 IST)
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో రాజ్‌ తరుణ్‌కు ఈ మధ్య వచ్చిన ఫ్లాప్ ఈ యంగ్ హీరో స్పీడ్‌కు బ్రేక్ వేసింది. దీనితో రాజ్ తరుణ్ తన సినిమాల ఎంపికలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ తన ఇమేజ్ మరింత పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన క్రేజ్‌ను పెంచుకోవడానికి మరో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. 
 
ఈ మధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఐటమ్ సాంగ్ క్రేజ్ కామన్‌గా మారిపోవడంతో రాజ్ తరుణ్ ఇప్పటికే పూర్తి అయిన ఒక సినిమాలో ప్రత్యేకంగా ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. 'దొంగాట' మూవీ దర్శకుడు వంశీ కృష్ణ డైరక్షన్‌లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు' అనే మూవీని చేస్తున్నాడు.
 
ఈ సినిమా నిర్మాణం పూర్తి అయిపోయినా ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలకు కొద్దిగా క్రేజ్ తగ్గిన నేపథ్యంలో ఈ సినిమా మార్కెట్ అవ్వడంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలు ఈ సినిమా దర్శక నిర్మాతల దృష్టికి రావడంతో ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను జోడించాలని ఈ సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు టాక్. 
 
అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు రష్మి అయితే బాగుంటుదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రష్మీ తన అందాలు ఆరబోయడంలో ఎటువంటి పరిమితులు లేకుండా సహకరిస్తున్న నేపథ్యంలో రష్మీ ఎక్స్‌పోజింగ్ ఈ సినిమాకు మరింత ప్లస్‌గా మారుతుందని ఈ సినిమా దర్శక నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. 'గుంటూర్ టాకీస్' మూవీలో రష్మీ నటించిన పాట యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం టాప్ రేంజ్‌లో కొనసాగుతున్న రష్మీ క్రేజ్ రాజ్ తరుణ్‌కు అన్ని విధాల సహకరిస్తుంది అని ఈ సినిమా నిర్మాతల భావన. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments