కుర్ర హీరోలతోనే చేస్తానంటున్న మాజీ సిఎం భార్య, ఎవరు?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:46 IST)
రాధికా కుమారస్వామి. చివరలో కుమారస్వామి పేరు చదివితేనే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి సతీమణి అని. ఈమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఈమె సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అదుర్స్ అనిపించేలా చేయగల సత్తా రాధికా సొంతం.
 
అయితే కుమారస్వామితో పెళ్ళయిన తరువాత కొన్నిరోజుల పాటు తెరపైన కనిపించకుండా పోయారు రాధికా. తెరకు చాలా దూరంగా ఉన్నారు. కానీ ఆమె మళ్ళీ తెరపైకి వచ్చేందుకు సిద్థమయ్యారు. శ్రీరామనవమి సెంటిమెంట్‌గా ఒక సినిమాలో షూటింగ్ చేసేందుకు సిద్థమయ్యారు రాధికా.
 
అయితే కరోనా వైరస్ పుణ్యమా అని ఆ షూటింగ్ కాస్తా ఆగిపోయింది. ఆ సినిమా పేరు భైరదేవీ. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. ఈ సినిమాతో తనకు గతంలో ఉన్న క్రేజ్ మళ్ళీ తెచ్చుకుంటానన్న నమ్మకంతో ఉన్నారు రాధిక. కానీ అది కరోనా కారణంగా ఆలస్యమవుతుండటంతో ఆమె మూడీగా మారిపోయారట. కానీ త్వరలోనే తాను కూడా షూటింగ్‌లో పాల్గొని తీరుతానని, మళ్ళీ అభిమానులను సంపాదిస్తానని ధీమాగా చెబుతోందట.
 
ఇదంతా ఒకే గానీ రాధికా మాత్రం యువ హీరోలతోనే నటిస్తానని దర్సక, నిర్మాతలకు తేల్చి చెప్పేస్తోందట. సీనియర్ హీరోలతో నేను ఇక చేయలేను. యువ హీరోలతోనే అయితే నటిస్తాను. లేకుంటే వేరే హీరోయిన్లను చూసుకోండి అంటూ చెప్పేస్తోందట. వచ్చిందే ఒక సినిమా ఛాన్స్..అప్పుడే ఇన్ని షరతులా అంటూ రాధికాపై దర్సక నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంతపురం హాస్టల్‌లో 19ఏళ్ల డిగ్రీ విద్యార్థిని అనుమానస్పద మృతి

మూడేళ్లలో ఆ మహిలపై 600 మంది అత్యాచారం చేశారు...

ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్

నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)

అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తాం.. కావాలంటే అరెస్టు చేసుకోండి : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments