Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌తో చేస్తోన్న సినిమా స్టోరీని పూరీ ముందుగా ఎవ‌రికి చెప్పాడో తెలుసా?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (21:58 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. పూరి టూరింగ్ టాకీస్ & పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పైన పూరి, ఛార్మి క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. టైటిల్‌కి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ నెల‌లోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... రామ్‌తో చేస్తోన్న ఇస్మార్ట్ శంక‌ర్ స్టోరీని ముందుగా ఓ హీరోకి వినిపించాడ‌ట‌. 
 
ఇంత‌కీ ఆ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అవును... ఇటీవ‌ల విజ‌య్‌ని పూరి క‌లిసిన‌ట్టు టాక్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌ను పూరి విజ‌య్‌కి వినిపించడ‌ాట‌. అయితే.. విజ‌య్ ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. క‌థ న‌చ్చినా సినిమా  చేయ‌లేని ప‌రిస్థితి. పూరి అంతకాలం ఆగే టైపు కాదు. ఏదైనా అనుకున్నాడంటే చ‌కచ‌కా చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే. అందుకే ఈ సినిమాని రామ్‌తో సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు సెట్ కాలేదు. భ‌విష్య‌త్‌లో పూరి - విజ‌య్ క‌లిసి సినిమా చేస్తారేమో చూడాలి మ‌రి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments