Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ నుండి సమాధానం లేదు. టైం వేస్ట్ చేస్తే ఎలా? : పూరి జగన్నాథ్

సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:03 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌ దాటిన తొలి సినిమా 'పోకిరి'. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. దాంతో మహేష్ బాబు-పూరి జగన్నాథ్‌లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని టాలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ వస్తుందని వార్తలు వెలువడ్డాయి.
 
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సైతం తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని పూరీ అన్నాడు. మధ్యలో తమ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా అంటూ ''జనగణమన'' పేరుతో ఒక పోస్టర్ కూడా వదిలాడు. కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి వార్తలు రాలేదు. తర్వాత మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు. దాదాపు షూటింగ్ కూడా పూర్తి కానుంది. కొరటాల శివ సినిమాను కూడా లైన్లో పెట్టాడు.
 
ఇంకా త్రివిక్రమ్ కూడా మహేష్‌తో ఓ సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టుల మధ్య పూరితో మహేష్ సినిమా సంగతే ఏం తేలడం లేదు. ఇదే విషయాన్ని పూరి దగ్గర ప్రస్తావిస్తే.. ''ఆ మధ్య మహేష్ బాబుకు కథ చెప్పాను. అతడికి నచ్చింది. అతను రెడీ అంటే సినిమా చేద్దామనుకుంటున్నా. కానీ ప్రిన్స్ నుండి సమాధానం రాలేదు. అందుకోసమే ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. మరి ఈ విషయంపై మహేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments