Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగువంద‌ల కోట్ల‌తో పుష్ప‌2 తీయ‌బోతున్నారా!

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:51 IST)
Pushpa poster
అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా క‌రోనా త‌ర్వాత ఎంత క్రేజ్ తీసుకువ‌చ్చిందో తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సుకుమార్ చెప్పాడు. పుష్ప సినిమాను ఉత్త‌రాదిలోకూడా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఓవ‌ర్‌సీస్‌నూ కోలీవుడ్‌లోనూ బాగా ఆద‌ర‌ణ చూపారు. ఇప్పుడు పార్ట్‌2ను మ‌రింత గ్రాండ్ తీసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఖ‌ర్చుకు త‌గ్గేదేలే అన్న‌ట్లు నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు. దాదాపు ఈ చిత్రం కోసం 400 కోట్లు వెచ్చించి తీయ‌నున్న‌ట్లు స‌మాచారం.
 
ఈ సినిమాకోసం అన్ని వుడ్‌ల‌నుంచి పేరున్న న‌టీన‌టుల‌ను తీసుకోబోతున్నారు. క‌థ‌ను మొద‌ట అనుకున్న‌ట్లుగాకుండా కొద్దిగా మార్చి అన్ని భాష‌ల స్టార్స్‌కు ప్రాధాన్య‌త ఇచ్చేలా చేసేందుకు సుకుమార్ రంగం సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర్వాత అంత పాపుల‌ర్ సినిమా పుష్ప‌నే తెలుగులో అవ్వాల‌నే కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందుకోసం పాట‌లు, ఫైట్స్‌ను స‌రికొత్త‌గా డిజైన్ చేసే ప‌నిలో వున్నారు. మ‌రోవైపు విదేశాల‌నుంచి ప‌రిణిత చెందిన సాంకేతిక సిబ్బంది కూడా ఈ సినిమాకు ప‌నిచేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. యాక్ష‌న్ ఎపిసోడ్‌ను పీట‌ర్ హేన్స్‌తోపాటు ఫారిన్ పైట‌ర్లు ఇందులో పాల్గొన‌బోతున్నారు. ఈ చిత్రం గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments