Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో రాహుల్‌ను నిరుత్సాహపరిచిన పునర్నవి (Video)

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (22:28 IST)
సినిమాల్లో నటించిన పునర్నవి పెద్దగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. కానీ బిస్ బాస్ 3తో పునర్నవి తెలుగు ప్రజలకు బాగానే కనక్టయ్యింది. ముఖ్యంగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో బాగానే ప్రేమాయణం నడిపించి వార్తల్లో నిలిచింది పునర్నవి. ఆ సీజన్ ముగిసినాసరే పునర్నవి మాత్రం పలు హాట్ షూట్లతో యువతను ఉర్రూతలూగిస్తోంది. 
 
ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది పునర్నవి. అలాగే మళ్ళీమళ్ళీ రాని రోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. అలాగే పిట్టగోడ, ఎందుకు ఏమో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ చిత్రాలన్నీ పునర్నవికి పెద్దగా పేర్లు తీసుకురాలేకపోయాయి.
 
అయితే ప్రస్తుతం చేతిలో పునర్నవికి సినిమాలు లేకపోయినా సరే ఆమె ఫేస్ బుక్‌లో ఫోటోల కోసం ఫోటో షూట్స్‌ను స్టార్ట్ చేసింది. తన అందాలను ఆరబోస్తూ తీసిన చిత్రాలు ఇప్పుడు యువకులు పదేపదే చూస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లోను, పొట్టి పొట్టి డ్రస్సుల్లోను ఫోటో షూట్లకు ఫోజిస్తోంది పునర్నవి. కొంతమంది హాట్ పునర్నవి అంటూ ఆ ఫోటోలను చూసి పొగడ్తలతో ముంచెత్తుతుంటే మరికొంతమంది కప్పుకోవాల్సిన చోట కప్పుకో అమ్మా అంటూ సలహాలిస్తున్నారు. 
 
అయితే ఒళ్ళు దాచుకోకుండా ఫోటోలకు ఫోజులివ్వడంపై రాహుల్ సిప్లిగంజ్ మాత్రం బాదపడుతున్నాడట. ఇప్పటికే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండడం.. త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారన్న ప్రచారం జరుగుతుండడం.. ఇలాంటి సమయంలో పునర్నవి రెచ్చిపోయి ఫోటో షూట్లో అందాలు ఆరబోయడం ఏమాత్రం రాహుల్‌కు ఇష్టం లేదట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్ పేరిట కొత్త వైన్‌ను పరిచయం చేసిన ఇజ్రాయేల్

ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..

రణరంగంగా జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ... ఎమ్మెల్యేల బాహాబాహీ (Video)

శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం - వీడియో వైరల్

ఉషా చిలుకూరి - జేడీ వాన్స్: అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రా అల్లుడు ఎలా అయ్యారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments