Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో రచ్చరచ్చ చేసిన పూజా హెగ్డే?

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (19:45 IST)
చేసింది తక్కువే సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులందరికీ హీరోయిన్ పూజా హెగ్డే సుపరిచితమే. జిల్ జిల్ జిగేలు రాజా ఐటెం సాంగ్‌లో పూజా నటించి మెప్పించారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు పూజా హెగ్డేకు పెద్దగా ఛాన్సులు రాలేదు. కథలు నచ్చకో.. లేకుంటే నచ్చిన కథకు తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో పూజా హెగ్డే తెరపై కనిపించడం తగ్గించేశారు. 
 
కానీ తాజాగా డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది పూజా హెగ్డే. ప్రభాస్‌కు ఇది 20వ సినిమా. కె.కె. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీక్రిష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటలీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే ఇటలీలలో వర్షం ఎక్కువగా పడుతుండటంతో షూటింగ్‌కు అంతరాయం కలుగుతోంది. కానీ పూజా హెగ్డే మాత్రం వర్షంపడితే బాగుంటోందని చెబుతోంది. 
 
వర్షం పడుతున్నప్పుడు షూటింగ్ ఆగిపోవడం.. వెంటనే పూజా హెగ్డే రోడ్డుపైకి వచ్చి వర్షంలో తడుస్తూ చిందులేయడం చేస్తోంది. ఇది చూస్తున్న సినిమా యూనిట్ ఆశ్చర్యపోతున్నారు. టాప్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే చిన్నపిల్ల మనస్తత్వంతో డ్యాన్సులు వేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. అయితే పూజా మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. వర్షంలో తుడవడం చిన్నప్పటి నుంచి తనకెంతో ఇష్టమని చెబుతోంది. ఎవరి ఇష్టం వారిదని చెబుతోంది పూజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments