Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న నేచురల్ స్టార్ నాని? నేను లోకల్‌కు తర్వాత..?

బాలీవుడ్ కథానాయికగా ప్రియాంక చోప్రా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను రాణించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నిర్మిస్తోన్న పంజాబీ .. మరాఠీ సిని

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (10:32 IST)
బాలీవుడ్ కథానాయికగా ప్రియాంక చోప్రా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను రాణించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నిర్మిస్తోన్న పంజాబీ .. మరాఠీ సినిమాలు సెట్స్‌పై వున్నాయి.
 
ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ప్రియాంక చోప్రా ఉందని తెలుస్తోంది. తెలుగులో మినిమమ్ గ్యారెంటీ గల హీరోల జాబితాను ఆమె సిద్ధం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ జాబితా ప్రకారం తెలుగులో ఆమె నిర్మించబోయే మొదటి సినిమాలో నాని నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుందా లేకుంటే.. నిర్మాణంతో సరిపెట్టుకుంటుందా అనే దానిపై క్లారిటీ లేదు. 
 
ఇకపోతే.. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం 'నేను లోకల్' చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్‌ నాని హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు డీవీవీ దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments