Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క హీరోయిన్‌గా రూ.25 కోట్ల బడ్జెట్‌తో భాగమతి.. హీరో ప్రభాస్ నిర్మాతగా...

బొద్దుగుమ్మ అనుష్క కొత్త సినిమా ''భాగమతి''కి సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు అనుష్క. గతంలో విడుదలైన ''అరుంధ‌తి'', ''రుద్ర‌మ‌దే

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (13:56 IST)
బొద్దుగుమ్మ అనుష్క కొత్త సినిమా ''భాగమతి''కి సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు అనుష్క. గతంలో విడుదలైన ''అరుంధ‌తి'', ''రుద్ర‌మ‌దేవి'', చిత్రాలలో త‌నదైనశైలిలో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. ప్రస్తుతం టెక్నో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ''భాగమతి'' సినిమా బడ్జెట్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా.. ఏకంగా రూ.25 కోట్లు. గతంలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడ నిర్మాతలు వెనుకాడుతారు. అయితే ''అరుంధతి'' విజయం తర్వాత అనుష్క హవా పెరిగి పోవడంతో ఆమెను నమ్ముకుని భారీ సినిమాలు తీయడానికి నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా రాబోయే ''భాగమతి'' సినిమాకి నిర్మాతలు భారీ రేంజ్‌లో ఖర్చు పెడుతున్నారని ఫిలిం వర్గాలు అంటున్నాయి. 
 
అంతేకాదు ఈ సినిమా కోసం భారీ మహల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారని సినీ నిపుణులు అంటున్నారు.. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి ''పిల్ల జమీందారు'' ఫేమ్ అశోక్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలనాటి అందాల నటి టాబు, యంగ్ హీరో ఆది పినిశెట్టి, మళయాళ సంచలనం ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. వంశీ ప్రమోద్ "యూవీ క్రియేషన్స్'' బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక అతిథి పాత్ర చేయబోతున్నాడు అన్న వార్తలు ఈ సినిమా క్రేజ్‌ను మరింత పెంచేస్తోంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments