Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కతో పెళ్ళా... అవన్నీ ఉత్తుత్తివే.. ''సాహో'' తర్వాత ఆలోచిస్తా!: ప్రభాస్

బాహుబలిలో టైటిల్ పాత్ర పోషించిన ప్రభాస్.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా పూర్తయ్యాక ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి2 రిలీజై వంద రోజు

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (15:29 IST)
బాహుబలిలో టైటిల్ పాత్ర పోషించిన ప్రభాస్.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా పూర్తయ్యాక ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి2 రిలీజై వంద రోజులు పూర్తైనా ప్రభాస్ పెళ్ళిపై కచ్చితమైన ప్రకటన లేదు. ఇంతలో బాహుబలి దేవసేననే నిజ జీవితంలోనూ ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తల్లో నిజం లేదని ప్రస్తుతం ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. 
 
అంతేకాదు.. తనకు విదేశాల్లో తాను పెళ్ళిచూపులకు హాజరవుతున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదని ప్రభాస్ స్పష్టం చేశారు. ఇంకా అనుష్కతో పెళ్లిపై ప్రభాస్ ఇలా అన్నారు. అనుష్క కూడా ప్రభాస్‌తో పెళ్ళిలేదని ఇటీవల చెప్పేసిన తరుణంలో ప్రభాస్ కూడా ఆమెతో వివాహం లేదన్నారు. ఒక హీరో, ఒక హీరోయిన్ వరుసగా రెండు, మూడు సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు రావడం సహజమేనని చెప్పుకొచ్చారు.
 
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. ఈ రూమర్స్ మొదట్లో తనకి ఇబ్బంది కలిగించినా.. ఆ తర్వాత వాటిని గురించి పట్టించుకోవడం మానేశానని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి ''సాహో" సినిమాపైనే ఉందనీ, ఆ సినిమా పూర్తయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానని ప్రభాస్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments