Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ను గృహనిర్బంధం చేసిన రాజమౌళి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:07 IST)
"బాహుబలి-2"  చిత్రం కోసం ప్రభాస్ తెగ కష్టపడుతున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ 130 కేజీల బరువుతో.. చక్కని శరీరాకృతిని సంతరించుకుని టైటిల్‌కి తగిన హీరో అనిపించుకోడానికి కసరత్తులు మొదలుపెట్టాడు. 'బాహుబలి-2' కోసం సిన్సియర్‌గా హోమ్ వర్క్ చేస్తున్నాడట. అందరికీ సినిమాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన జక్కన్న.. ఈ 'ఛత్రపతిని‌'ని మాత్రం లాక్ చేసి పెట్టడానికి ఇదే కారణమట.
 
'బాహుబలి' మొదటి పార్టులో శివుడు పాత్రలో 130 కేజీల ఫిజిక్‌తో బలిష్టంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే సినిమా షూటింగ్ తర్వాత ప్రభాస్ మళ్లీ కాస్త నార్మల్‌గా అయ్యాడు. మళ్లీ ఇపుడు 'బాహుబలి-2' కోసం కొన్ని రోజుల ముందు నుండే ప్రభాస్ వర్కౌట్స్ మొదలు పెట్టాడు.
 
ఇందులోనూ ఆయన కండలు తిరిగిన శరీరంతో కనిపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. అమెరికా నుంచి ప్రత్యేకమైన 'జిమ్' పరికరాలను తెప్పించి ఆయన ఇంట్లోనే ఏర్పాటు చేశారని సినీప్రముఖులు చెబుతున్నారు. అలాగే ఆయన తీసుకునే ప్రత్యేకమైన డైట్‌ను కూడా ఇంట్లోనే రెడీ చేస్తున్నారట. 
 
ప్రతి రోజు ఉదయం.... సాయంత్రం నిపుణుల పర్యవేక్షణలో ప్రభాస్ వ్యాయామం చేస్తున్నాడు. అలాగే క్రమం తప్పకుండా యోగా కూడా చేస్తున్నాడని చెబుతున్నారు. ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్, డైటీషియన్స్ పర్యవేక్షణలో వర్కౌట్స్ చేస్తూ ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments