Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా ప్రభాస్ కజిన్ రవి వర్మ: వారసుల హవా.. మెగాఫ్యామిలీ నుంచి 9 మంది?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (15:27 IST)
తెలుగు సినీరంగంలోకి వారసుల రాక కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఇపుడు తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా వారసులే ఉన్నారు. ఇంతకుముందు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు నిర్మాతలు, టెక్నీషియన్ల పిల్లలు కూడా హీరోలైపోతున్నారు. పెద్ద పెద్ద ఫ్యామిలీలతో లింకున్న బంధువర్గం నుంచి కూడా హీరోలు తయారవుతున్నారు.  
 
వారసుల రాక ఇప్పటిది కాదు సీనియర్ నటుడు యన్.టి.ఆర్ కాలం నుండి కొనసాగుతూనే వస్తుంది. ఆ వంశంలోనే దాదాపు చాలా మంది హీరోలున్నారు. ఇదే కోవలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. ఒక్క మెగా ఫ్యామిలీలోనే ప్రస్తుతం తొమ్మిది మంది హీరోలున్నారంటే నమ్ముతారా? మిగతా ఫ్యామిలీల్లో కూడా ఈ పరిస్థితే కనిపిస్తోంది.
 
ఇదే క్రమంలో మరొకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు ప్రభాస్ కజిన్. అతడి పేరు రవి వర్మ. చౌడప్ప అనే కొత్త దర్శకుడు తీయబోయే చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. నిర్మాణ సంస్థ ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రవివర్మలో కొంచెం ప్రభాస్ పోలికలు కూడా కనిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. అతను కూడా ప్రభాస్ కజినే. పేరు సిద్దార్థ్. కెరటం అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా వచ్చిన సంగతి పోయిన సంగతి తెలియదు. ఆ హీరో మళ్లీ కనిపించలేదు. మరి ఈ రవి వర్మ అయినా ప్రభాస్‌లా నిలదొక్కుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే మరి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments