Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - అల్లు అర్జున్ భారీ మల్టీస్టారర్ మూవీ?

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (22:03 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ బాగా పెరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, గోపాలా గోపాలా, ఎఫ్ 2, వెంకీ మామ... ఇలా మల్టీస్టారర్ మూవీస్ అన్నీ సక్సస్ సాధించడంతో మల్టీస్టారర్ మూవీస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దర్శకనిర్మాతలు ఇప్పుడు క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా ప్లానింగ్‌లో ఉన్న మూవీనే ప్రభాస్ - అల్లు అర్జున్ మూవీ అని టాక్.
 
ఇంతకీ.. ఈ భారీ చిత్రాన్ని సెట్ చేస్తుంది ఎవరో కాదు అభిరుచి గల నిర్మాత దిల్ రాజు అని తెలిసింది. దిల్ రాజు బ్యానర్‌లో ప్రభాస్ ఓ మూవీ చేయాలి కానీ.. ఇప్పటివరకు సెట్ కాలేదు. అయితే... దిల్ రాజు మాత్రం "ఆర్ఆర్ఆర్" రేంజ్‌లో భారీగా ఉండేలా ఈ మూవీ తీయాలి అనుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌కి తగ్గా కథను రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చేస్తున్నారు. ఆతర్వాత "ఆదిపురుష్" చేయనున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో మూవీతో మరో మూవీ చేయనున్నాడు. 
 
ఇక బన్నీ విషయానికి వస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల డైరెక్షన్‌లో మూవీ చేయనున్నారు. ఇలా వీరిద్దరూ ఓకే చేసిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో ఈ మల్టీస్టారర్ మూవీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి... ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments