Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి రెచ్చిపోతున్న పూనమ్‌పాండే... యాప్‌తో కుర్రకారుకు కిక్కెక్కిస్తుందట

2011లో క్రికెట్ ప్రపంచకప్‌తో వస్తే మొత్తం బృందం ముందు స్ట్రిప్ టీజ్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించి లైమ్‌లైట్‌లోకి వచ్చిన పూనమ్‌పాండే తన అందాలని ఆరబోసేందుకు ఏ సందర్భాన్నీ వదలదు. కాదేదీ పబ్లిసిటీకి అనర

Webdunia
మంగళవారం, 23 మే 2017 (12:33 IST)
2011లో క్రికెట్ ప్రపంచకప్‌తో వస్తే మొత్తం బృందం ముందు స్ట్రిప్ టీజ్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించి లైమ్‌లైట్‌లోకి వచ్చిన పూనమ్‌పాండే తన అందాలని ఆరబోసేందుకు ఏ సందర్భాన్నీ వదలదు. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అనే రేంజిలో క్రిస్మస్, హోళీ, దీపావళి మొదలైన పండుగల సందర్భంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా తన టార్గెట్ ఆడియన్స్‌కు అందాలను విందు చేస్తుంటుంది.
 
ఇప్పుడు ఈ భామ మరో ఫోటో షేరింగ్ నెట్వర్క్ ఇన్‌స్టాగ్రామ్ బాట పట్టినా అంతకు మించి మరేదో కావాలన్నట్లు, ఓ యాప్‌ను రంగంలోకి తెచ్చింది. తన యాప్‌కు ప్రచారం కల్పించేందుకు రోజుకో ఘాటు బొమ్మను పోస్ట్ చేస్తూ, మరిన్ని అందాలు కావాలంటే నా యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని వల వేస్తోంది. ఏప్రిల్‌లో ఈ యాప్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి నిషేధించినా, తన దారిలో తన పని చేసుకుపోతోందీ భామ.
 
ప్రస్తుతం చేతిలో కేవలం ఒకే సినిమా ఉన్న ఈ సి-గ్రేడ్ భామ అందులోనూ ఓ ఐటెమ్ సాంగ్‌కు మాత్రమే పరిమితమైంది. వెండి తెరపై పూనమ్ నషా, లవ్ ఇన్ పాయిజన్, మాలిని అండ్ కో ఇత్యాది చిత్రాల్లో నటించినా సినీ కెరీర్‌ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి తన మొబైల్ కెమెరాకి పని చెప్పడం ప్రారంభించింది. వీలైనంత పొదుపుగా బట్టలు ధరిస్తూ, వీక్షకులను ఊరించే ఫోటోలను అప్‌లోడ్ చేయడం అలవాటైన పూనమ్‌పాండే యాప్‌ను గూగుల్ మరోసారి బ్యాన్ చేసినా ఆశ్చర్యం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments