పూజా హెగ్దెకి దానిపై ఎందుకంత మోజు?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (19:54 IST)
టాలీవుడ్లో పూజా హెగ్డే బిజీ హీరోయిన్. నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్ ఇలా వరుస విజయాలు పూజా హెగ్డేకు తెలుగు చిత్ర సీమలో మంచి పేరునే తెచ్చిపెడుతున్నాయి. ఇదంతా పూజా హెగ్డేకు అస్సలు ఇష్టం లేదట.
 
అందుకు కారణం బాలీవుడ్ అట. ఎప్పటికైనా బాలీవుడ్ లోనే స్థిరపడాలన్నది పూజా ఆలోచన. అందుకే అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లోను నటిస్తోంది. ఆ మధ్య హృతిక్ రోషన్‌తో కలిసి ఒక సినిమా చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. కానీ పూజా హెగ్డేకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది.
 
ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో హౌస్‌ఫుల్ 4 సినిమాలో నటిస్తోంది. ఇదొక కామెడీ మూవీ. క్రైరమైన కింగ్ పాత్రలో రానా కనిపిస్తాడు. ఇందులో మరికొంతమంది సీనియర్ నటులు ఉన్నారు. ఇందులో పూజాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా తరువాత తనకు బాలీవుడ్లో అవకాశాలొస్తాయని.. ఇక టాలీవుడ్‌కు రావాల్సిన అవసరం లేదంటోంది పూజా హెగ్డే. తనకు ఇష్టమైన పరిశ్రమ బాలీవుడ్ అంటోంది పూజా. అయితే అక్కడ అవకాశాలు రావడంలేదు కాబట్టి ప్రస్తుతానికి తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని చాలా నీరసంగా చెబుతోంది పూజా.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెతన్యాహుపై ఇరాన్ ఖైబర్ క్షిపణులతో మెరుపు దాడి చేసిందా? కార్యాలయం ధ్వంసమైందా?

బాచుపల్లి ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై దారుణం.. మత్తుమందిచ్చి లైంగిక దాడి

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments