Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయ్.. అమితాబ్

అమితాబ్ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పింక్‌'. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అనిరుద్ధ రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'పింక్‌' సినిమా

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:48 IST)
అమితాబ్ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పింక్‌'. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అనిరుద్ధ రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'పింక్‌' సినిమా సెప్టెంబర్‌ 18న విడుదల కానుంది. పింక్ సినిమాలో అమితాబ్ లాయర్ పాత్రలో నటించారు. షూజిత్ సిర్కర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
విక్కీ డోనార్, మద్రాస్ కేఫ్, పికూ లాంటి సందేశాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శూజిత్ సర్కార్ నిర్మాతగా మారి 'పింక్' అనే మరో సందేశాత్మక సినిమాను అందిస్తున్నారు. అనిరుద్ధ రాయ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తాప్సీ న్యాయం కోసం పోరాడే ఓ రేప్ బాధితురాలిగా నటించింది. ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు నటుడిగా 40 ఏళ్లకుపైగా అనుభవముంది. ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 
 
73 ఏళ్ల వయసులోనూ సత్తాచాటుతున్నారు. అగ్రహీరోగా వెలుగొంది, క్యారెక్టర్ స్టార్గా మారడం ఇబ్బందిగా అనిపించిందా అన్న మీడియా ప్రశ్నకు.. ఆ దిశగా ఆలోచించలేదని అమితాబ్ చెప్పారు. నటించడం తనకు ఇష్టమని, అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయని, క్యారెక్టర్ పాత్రలోనైనా లేదా ఇతర పాత్రలోనైనా నటిస్తానని అన్నారు. ఇండస్ట్రీ కి వచ్చి 40 ఏళ్ళు గడిచిన ప్రతి చిత్రం ఓ పరీక్షగా ఉంటుందని, పింక్ షూటింగ్ సమయంలో ప్రతిషాట్లో నటించే ముందు నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు. ప్రతి సీన్ చేసేముందు ఇప్పటికి మొదటి చిత్రంలాగే ఉంటుందని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments