Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్త క్రేజీగా.. గ్లామర్‌గా ఉండే పాత్రల్లో నటించాలని వుంది : తాప్సీ

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఝమ్మంది నాదం'. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన బబ్లీ బ్యూటీ తాప్సీ. పలు పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను ఈ ఢిల్లీ చిన్నది ఆలరించింది. కొంతక

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (14:56 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఝమ్మంది నాదం'. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన బబ్లీ బ్యూటీ తాప్సీ. పలు పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను ఈ ఢిల్లీ చిన్నది ఆలరించింది. కొంతకాలం మంచు ఫ్యామిలీ హీరోయిన్‌గా ముద్రవేయించుకుంది. 
 
ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ భామ అక్కడ బబ్లీ పాత్రల్లో కాకుండా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం 'జుడ్వా 2'లో నటిస్తున్న ఈ అమ్మడు.. ఆ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాలను ఇలా వివరించింది.
 
''నా వయసుకు తగ్గట్టుగా ఉండి.. సరదాగా సాగే పాత్రల్లో నటించాలని ఉంది. చిన్నప్పటి నుంచి మసాలా సినిమాలు చూస్తూ పెరిగా. డ్యాన్స్‌ చేయడం.. సరదాగా ఉండటమంటే ఇష్టం. అల్లరి కూడా చేస్తా. కానీ అలాంటి సినిమాలు చేయడం లేదు. అందుకే కాస్త మసాలా చిత్రాల్లో నటించాలని వుంది. 
 
ఇకపోతే.. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రల్లోనే నటిస్తుంటే ప్రేక్షకులకు బోర్‌ కొట్టేస్తుంది. దీంతో ఆ పాత్రలకు బ్రేక్‌ ఇచ్చి.. కాస్త క్రేజీగా.. గ్లామర్‌గా ఉండే పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నా. అందుకే 'జుడ్వా 2'లో నటించే అవకాశం రాగానే ఒప్పేసుకున్నా.'' అని చెప్పింది తాప్సీ.
 
''గత మూడేళ్లుగా బాలీవుడ్‌లో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకే ప్రయత్నించా. ఇక్కడ నేను పొరపాటు చేస్తే.. ఎవరూ మళ్లీ అవకాశం ఇవ్వరు. అందుకే చాలా జాగ్రత్తగా.. ఆలోచించి సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నా. అందుకే ఇప్పటివరకు ఇలాంటి విభిన్న చిత్రాల్లో నటించా.''నని చెప్పుకొచ్చింది తాప్సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

తితిదే ఛైర్మన్ తాగి మాట్లాడుతున్నారా?: రోజా వివాదస్పద వ్యాఖ్యలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments