Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయనున్న నయనతార.. 'వేదాళం' రీమేక్‌లో...

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్‌పై ఎంతో కసరత్తు జరిగింది. 'కత్తిలాంటోడు' అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:29 IST)
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్‌పై ఎంతో కసరత్తు జరిగింది. 'కత్తిలాంటోడు' అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా.. చివర్లో 'ఖైదీ నెం.150'కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి 'చందమామ' కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఈ చిత్రం కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించారు. నయనతారను హీరోయిన్‌గా తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసారు. కానీ నయనతార ఈ సినిమాకి డేట్లు కుదరదని చెప్పడంతో ఎట్టకేలకి కాజల్‌ని ఎంపికచేసుకున్నారు. అయితే చిరుతో రొమాన్స్‌‌కి ఒప్పుకోని మలయాళ ముద్దుగుమ్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయడానికి సై అంటోంది. 
 
ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం నిర్మాతగా ఓ చిత్రం రూపొందుతున్నవిషయం తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జిల్లా' ఫేం ఆర్‌.టి.నేస‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీంతో దర్శకుడు ఆమెను సంప్రదించాడట. ఈ సినిమా చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. 
 
ఇది తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్. తమిళ చిత్రంలో అజిత్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. తమిళంలో ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్, నయనతార జత కట్టబోతున్నారు. మరి ఈ జంట ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments