Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బుల్లెట్ నడిపేస్తోన్న 'కాటమరాయుడు'..

పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ వాడుతుంటాడు. గతంలో ''సర్దార్ గబ్బర్ సింగ్''లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రాయల్ ఎన్ పీల్డ్ బైక్ కొన్ని మార్పులతో డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంత

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (17:19 IST)
పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ వాడుతుంటాడు. గతంలో ''సర్దార్ గబ్బర్ సింగ్''లో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా రాయల్ ఎన్ పీల్డ్ బైక్ కొన్ని మార్పులతో డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఆ బైక్‌ని వేలం కూడా వేశారు. పవన్ కల్యాణ్ తన సినిమాలో బైక్ నడిపినా .. జీప్ నడిపినా వాటికో ప్రత్యేకత వచ్చేస్తుంటుంది. ఇప్పుడు పవన్ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' సినిమాలోను ఆయన బుల్లెట్ నడిపినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
వాటిని దగ్గర నుంచి చూడాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతుంటారు. దీంతో ఆ బుల్లెట్ ఫోటోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు... బుల్లెట్ నెంబర్ 1 కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాదాద్‌లోని రామానాయుడు స్టూడియోలో శరవేగంగా జరుగుతోంది. జానీ మాస్టర్ నేతృత్వంలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments