ఇద్దరు హీరోయిన్ల సరసన రీ-ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. కథేంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (18:19 IST)
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమాల విషయాన్ని ఆయన పూర్తిగా పక్కనబెట్టేశారు. ఎపిలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రైతుల కష్టాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎపిలోని అన్ని జిల్లాల్లో పర్యటనలను కొనసాగిస్తున్నారు.
 
అయితే పవన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందీలో భారీ విజయాన్ని సాధించిన పింక్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారట. శ్రీదేవి భర్త బోనీకపూర్, ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌లు కలిసి ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయట.
 
అయితే మొదట్లో పింక్ సినిమాలో తాను నటించడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పినా ఆ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మార్చేసుకున్నారట. జనవరి 15వ తేదీ పైన ఈ సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్లు ఆ సినిమా యూనిట్ సభ్యులే బహిరంగంగా చెప్పేస్తున్నారు. 
 
ఇక ఆ సినిమాలో నివేదా థామస్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ సరసన నటించిన సమంత మరోసారి ఆయనతో కలిసి నటించబోతోంది. ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనానే ఉందట. శ్రీరామ్ సినిమాకు దర్సకత్వం వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

విజయ్ నేరుగా వచ్చి పరామర్శించలేదు.. రూ.20లక్షలు తిప్పి పంపిన కరూర్ బాధితురాలు

అంటు వ్యాధులు ప్రబలుతాయ్.. తస్మాత్ జాగ్రత్త : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments