ఏయ్ కమ్మీ.. నోరు జాగ్రత్త. మండిపడ్డ పవర్ స్టార్. బిత్తరపోయిన యూనిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని అయ్ అయ్ ఆయ్ అంటూ పవన్ రంకె వేశాడంటే గుండె అదరాల్సిందే. తానెందుకు ఎలా ఎగురుతున్నాడు. అలా ఎందుకు మండిపడుతున్నాడు అనేది ఎవరికీ అర్థంకాకపోవచ్చనేది మరో విషయం.

Webdunia
సోమవారం, 10 జులై 2017 (07:51 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేదిక మీదే శివాలెత్తిపోతే చూడలేం. శత్రువు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని అయ్ అయ్ ఆయ్ అంటూ పవన్ రంకె  వేశాడంటే గుండె అదరాల్సిందే. తానెందుకు ఎలా ఎగురుతున్నాడు. అలా ఎందుకు మండిపడుతున్నాడు అనేది ఎవరికీ అర్థంకాకపోవచ్చనేది మరో విషయం. కానీ షూటింగులో ఉండగా పవన్ బారిన పడితే వాళ్లు కోలుకోవడం కష్టమేనని చాలా సందర్బాలల్లో రుజువైంది. పవన్‌ వద్ద ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే చాలా ప్రమాదం అని తెలియని ఒక కమిడియన్ ఇటీవలే తనతో పెట్టుకుని జన్మకు సరిపడే అనుభవం సంపాదించుకున్నాడని వార్తలు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి కోపమొస్తే ఎలా వుంటుందో చాలామందికి తెలుసు. ఈసారి పవన్ చేతిలో ఆగ్రహానికి గురైంది ఓ కమెడియన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సెట్స్‌లోనే ఓ కమెడియన్ పవన్ కల్యాణ్ వద్ద జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారట. సినిమా షూటింగ్ జరుగుతున్న చోట జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొచ్చిన కమెడియన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.  నీ హద్దుల్లో నువ్వు వుంటే చాలా మంచిది అని పవన్ అతడిని కాస్త గట్టిగానే మందలించారట.
 
ఫిలింనగర్ టాక్ ప్రకారం పవన్ ఆగ్రహానికి గురైన కమెడియన్ పేరు ఏంటనేది బహిర్గతం కావడం లేదు కానీ అతడు నతిన్-త్రివిక్రమ్‌ల 'అ.. ఆ' సినిమాలోనూ నటించాడని మాత్రం తెలుస్తోంది
పవన్ కల్యాణ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జులై 19న పవన్-త్రివిక్రమ్ మూవీ యూనిట్ యూరప్ ప్రయాణమవుతోంది. 20 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు చిత్రీకరించనున్నారు.
 
పవన్ బారిన పడి నలిగిపోయిన ఆ కమెడియన్ ఎవరంటారా.. అ ఆ సినిమాను తల్చుకోండి మరి..
అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments