Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బిజీ బిజీ.. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు 40 రోజులకు రూ.40కోట్లు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా కనిపిస్తున్నారు. త్వరలో తమిళంలో హిట్ కొట్టిన విజయ్ థెరి సినిమా తెలుగులోకి

Webdunia
బుధవారం, 19 జులై 2017 (17:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా కనిపిస్తున్నారు. త్వరలో తమిళంలో హిట్ కొట్టిన విజయ్ థెరి సినిమా తెలుగులోకి రీమేక్ కానుంది. ఈ చిత్రంలో పవన్ పోలీసాఫీసరుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ పేరు వినిపిస్తోంది. 
 
త్వరలో తాను పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించనుండటంతో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్, థెరీ రీమేక్‌లను ముగించేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్‌తో ఒక సినిమా సెట్స్‌పై వుంది. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్లో (థెరి రీమేక్) పవన్ చేసే సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 40 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. ఇందుకుగాను ఆయన అందుకునే పారితోషికం రూ.40 కోట్లు అనే ప్రచారం జరుగుతోంది. 
 
ఇప్పటికే ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్న పవ‌న్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న తన 25వ సినిమా కోసం బల్గేరియాకు వెళ్లారు.  20 రోజుల పాటు అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. బల్గేరియాలో కొన్ని ముఖ్య స‌న్నివేశాల‌తో పాటు పవన్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్‌పై రెండు పాటలు షూట్ చేయనున్నారట. దసరాకు ఈ సినిమా రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments