Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ (Video)

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (18:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరచిపోలేని సినిమా గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కించారు. బ్లాక్ బష్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్ - హరీష్ శంకర్ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
 
ఆఖరికి పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీని ఎనౌన్స్ చేయడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఉండేది. వచ్చే సంవత్సరంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... పవన్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకున్న ఇమేజ్‌కు తగ్గట్టుగా పొలిటికల్ మూవీనే ప్లాన్ చేసాడట హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ వలే పంచ్ డైలాగ్స్ లేకపోయినా... పొలిటికల్ డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం. ఆల్రెడీ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసి.. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్‌కి వెళ్లడానికి రెడీగా ఉన్నాడట హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ -హరీష్ శంకర్ కాంబో ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.  
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments