అవకాశాలు వస్తాయో లేవో.. పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్?

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (14:25 IST)
ప్రముఖ నటులు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంపై టాలీవుడ్‌లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా పవిత్ర రెమ్యూనరేషన్ విషయంలో పాపులర్ అయ్యింది. పవిత్ర లోకేష్ కన్నడ నటి అయినా.. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 
 
ప్రముఖ హీరోల సినిమాల్లో తల్లిగా నటించి పేరు సంపాదించుకుంది. తెలుగులో ఆమెకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. ఇక ఇటీవల శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా.. ఈమె నరేష్ ఇద్దరూ కలిసి నటించడంతో.. వీరిద్దరి సన్నివేశం థియేటర్లలో వచ్చినప్పుడు ఈలలు గోలలు చేశారు సినీ ప్రేక్షకులు.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషకం కూడా భారీగా పెంచేసింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ పారితోషకం విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల క్రితం వరకు ఆమె రోజుకు 60 వేల రూపాయలను మాత్రమే పారితోషికంగా తీసుకునేది.
 
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఏకంగా లక్షల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం. ఒక్కో సినిమాకు లక్ష రూపాయలు రోజుకు పారితోషకం డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ వ్యవహారంతో సినీ అవకాశాలు వస్తాయో లేవో.. అందుకే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CMOtamilnadu : 24 గంటల్లో 10 లక్షలు పెరిగిన ఇన్‌స్టా ఫాలోయర్లు

సీఎం విజయ్ సంచలన నిర్ణయం : ఆ టాస్మాక్ దుకాణాల మూసివేతకు ఆదేశం

#WorkFromHome దిశగా కేంద్రం అడుగులు... ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

బండి సంజయ్ కుమారుడు బండి బాగీరథ్‌పై పోక్సో కేసు నమోదు

రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

డయాబిటీస్, ఊబకాయం పోషణ రంగంలో మరింత శక్తివంతం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్, నెస్లే హెల్త్ సైన్స్

10 తాజా లేత ఆకులను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments