ఒక డైరెక్టర్.. ఒక హీరో బాగా వాడుకున్నారు... అందుకేనంటున్న నటి ఎవరు?

పార్వతి మెల్టన్.. సినీ పరిశ్రమలో తనకు రెకమెండేషన్ చేసేవారు లేకున్నా తన అందాలను ఆరబోసి ఛాన్సులు సంపాదించుకున్న హీరోయిన్. ఇప్పటికే పార్వతి ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించి తన అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే. 2012 సంవత్సరంలో పార్వతి వివాహం చేసుకుంద

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:11 IST)
పార్వతి మెల్టన్.. సినీ పరిశ్రమలో తనకు రెకమెండేషన్ చేసేవారు లేకున్నా తన అందాలను ఆరబోసి ఛాన్సులు సంపాదించుకున్న హీరోయిన్. ఇప్పటికే పార్వతి ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించి తన అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే. 2012 సంవత్సరంలో పార్వతి వివాహం చేసుకుంది. ఆ తరువాత ఒకే ఒక్క సినిమా చేసింది. 
 
పార్వతి నటించిన చివరి సినిమాను మూడు బాషల్లో రిలీజ్ చేద్దామనుకున్న ఆ సినిమా డైరెక్టర్ ఇప్పటివరకు ఆ సినిమాను అస్సలు రిలీజ్ చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా పార్వతి ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
పార్వతి మెల్టన్ అమెరికాలో ఉంటే ఒక ప్రముఖ దర్శకుడు, మరో ప్రముఖ హీరో ఇద్దరు కలిసి నీకు సినిమాల్లో మంచి భవిష్యత్ ఉంది.. హైదరాబాద్‌కు వచ్చేయ్ అంటూ ఆఫర్లు ఇచ్చారట. రెండుమూడు సినిమాల్లో నటించిన తరువాత ఛాన్సులు రాకపోవడంతో పార్వతి మెల్టన్ పరిస్థితి అన్యాయంగా తయారైంది.
 
కొన్ని నెలల పాటు ఆ సినిమా డైరెక్టర్.. హీరో చుట్టూ తిరిగిందట. వారు చేతులెత్తేయడంతో ఇక చేసేది లేక అమెరికాకు వెళ్ళి పెళ్ళి చేసేసుకుందట. నాలుగు సంవత్సరాలవుతున్నా తనకు తన భర్తతోనే కలిసి ఉండటం మంచిదంటోందట పార్వతి మెల్టన్. ఒక డైరెక్టర్.. ఒక హీరో కలిసి తనకు చేసిన మోసాన్ని అస్సలు మరిచిపోలేనని తన సన్నిహితులతో ఇప్పటికీ చెబుతోందట. సినిమాల్లో నటించడానికి వచ్చే హీరోయిన్లను వాడుకుని వదిలేయాలన్న దుర్భిద్ధి పరిశ్రమలో పోతేనే ఆ పరిశ్రమ బాగుపడుతుందని చెబుతోందట పార్వతి మెల్టన్. మళ్ళీ బుద్థుంటే సినిమాల్లో నటించనని తెగేసి చెప్పేస్తోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చూస్తుంటే తమిళనాడులో దళపతి విజయ్ గెలిచేటట్లే వున్నారు, ఎలాగంటే?

చాక్లెట్ ఇస్తానని నమ్మించింది... జ్యూస్ అని యాసిడ్ తాగించింది..

మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, 8 గ్రాముల బంగారం.. టీవీకే విజయ్

Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి

మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

Diabetic Kidney Disease, డయాబెటిక్ కిడ్నీ వ్యాధి నిరోధించేందుకు సింపుల్ టిప్స్

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

తర్వాతి కథనం
Show comments