Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్ మనీశ్ శర్మతో ప్రేమలో మునిగి తేలుతున్న పరిణీతి చోప్రా!

బాలీవుడ్ దర్శకుడు మనీష్ శర్మ, పరిణీతి చోప్రాల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో పని చేస్తున్న సమయంలో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (16:14 IST)
బాలీవుడ్ దర్శకుడు మనీష్ శర్మ, పరిణీతి చోప్రాల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో పని చేస్తున్న సమయంలో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. దర్శకుడు మనీశ్‌ శర్మ దర్శకత్వంలో వెలువడిన ''లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్'', ''శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌'' చిత్రాల్లో నటించిన పరిణీతి... మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ళ ప్రేమాయణం కొనసాగించిన తర్వాత వీరిద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
 
అయితే.. వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై పరిణీతి తనదైన శైలిలో స్పందించింది. అదేంటంటే.. ''మనీశ్‌ శర్మ నాకు మంచి మిత్రుడు.. మా మీద వస్తున్న పుకార్లపై మేమిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం కూడా మానేశాం'' అని తేల్చి చెప్పేసింది. అంతేకాదు... ''నా ప్రేమ వ్యవహారం పూర్తిగా నా వ్యక్తిగతం. దాని గురించి నాకు.. నా సన్నిహితులకు మాత్రమే తెలుసు... ఎవరి కోసమో నా పర్శనల్ జీవితాన్ని బయటపెట్టాలని అనుకోవడం లేదు'' అని ఘాటు సమాధానమిచ్చింది. 
 
అయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్ షూటింగ్ సమయంలో పరిణీతి తరుచూ కనిపించడం, దర్శకుడితో సన్నిహితంగా ఉండడంతో.... వీరిద్దరూ మళ్ళీ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ జనాలు ధ్రువీకరించారు. ఏదిఏమైనా ఈ విషయంపై పరిణీతి పెదవి విప్పితేగానీ అసలు విషయం బయటికి రాదని సినీ నిపుణులు అంటున్నారు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments