Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓం నమో వేంకటేశాయ...' హుండీలో అయితే వేస్తారు కానీ....

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (16:33 IST)
అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. అయితే ఈ చిత్రంపై బయట డివైడ్‌ టాక్‌ వుంది. 
 
అన్నమయ్య, శ్రీరామదాసు కంటే ఏమీ బాగోలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. అందుకు తగినట్లుగా కలెక్షన్లు ఆ రేంజ్‌లో లేకపోవడం బయ్యర్లకు పెద్ద నిరాశను కల్గించిందని తెలుస్తోంది. రిలీజ్‌ అయి నాలుగు రోజులయినా.. రూ. 7.5 కోట్ల షేర్‌‌ను మాత్రమే రాబట్టగలిగింది. ఆ తరువాత వసూళ్లు నిలకడగానే వున్నాయి గానీ పెరగలేదు. 40 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ సినిమా, ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం బయ్యర్లకి నష్టాలు తప్పకపోవచ్చనే టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌‌లో వినిపిస్తోంది. భక్తులు గోవిందుని హుండీలో అయితే వేస్తారు కానీ సినిమా టిక్కెట్లకు ఎందుకిస్తారూ... అని కొంతమంది దీర్ఘం తీస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments