మహేష్‌ మూవీలో నివేదా థామస్.. ఇది నిజమేనా? (video)

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (12:07 IST)
జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఆ తర్వాత నిన్నుకోరి సినిమాతో మరో విజయం సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది నివేదా థామస్.
 
జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది. యూత్‌ని బాగా ఆకట్టుకుంది కానీ... ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. 118, బ్రోచేవేరేవరురా, దర్బార్ సినిమాలతో మెప్పించినా.. స్టార్ హీరోల సినిమాలు అనుకున్నంతగా ఛాన్స్‌లు రాలేదు.
 
ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్‌ బాబు - గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో సర్కారు వారి పాట అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇందులో నివేదా థామస్ కూడా నటించనున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని... ఈ సినిమాతో నివేదాకు మరింత పేరు రావడం ఖాయం అంటున్నారు. ఇదే కనుక నిజమైతే... నివేదా థామస్‌కు బంపర్ ఆఫరే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments