Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ముదురు హీరోకి మలయాళీ భామ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతా

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (10:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ముదురు హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన సరసన నటించేందుకు కుర్ర హీరోయిన్లే కాదు... కొందరు సీనియర్ హీరోయిన్లు సైతం ససేమిరా ఉంటున్నారు. ఈ కోవలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార ఇలా చాలా మందే ఉన్నారు. దీంతో వెంకీ సరసన నటించే హీరోయిన్ కరువైంది. 
 
ఈ నేపథ్యంలో ముదురు హీరో సరసన నటించేందుకు ఓ మలయాళీ భామను ఫిక్స్ చేశారట. 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విక్టరీ హీరో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ మూవీకి ప్లాన్ చేశాడు. ఇందులో కథానాయికగా కాజల్‌ లేదా తమన్నాను అనుకున్నప్పటికి పలు కారణాల వలన మలయాళ కుట్టీ నిత్యామీనన్‌ని ఫైనల్ చేశారనే టాక్ వినిపిస్తుంది. 
 
ఈ మధ్య అంతగా సినిమాలు లేని నిత్యా.. వెంకీతో సినిమాకి సై అందట. మరి వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "ఆడవాళ్లూ మీకు జోహార్లు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments