Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో నటించేందుకు ఇష్టం లేదు.. డైరెక్టర్ ఒత్తిడి మేరకే నటించా : నికిషా పటేల్

పవన్ కళ్యాణ్ హీరోగా "కొమరం పులి" చిత్రం వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నికిషా పటేల్ నటించగా, ఎస్.జే సూర్య దర్శకుడు. పైగా, నికిషా పటేల్ టాలీవుడ్ వెండితెరకు పరిచయమ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (14:01 IST)
పవన్ కళ్యాణ్ హీరోగా "కొమరం పులి" చిత్రం వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నికిషా పటేల్ నటించగా, ఎస్.జే సూర్య దర్శకుడు. పైగా, నికిషా పటేల్ టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన మొదటి చిత్రం కూడా ఇదే. 
 
నిజానికి పవన్‌ సినిమాలో హీరోయిన్‌ అంటే ఆ తర్వాత వరుసబెట్టి సినిమా అవకాశాలు వచ్చేస్తాయని ఆశపెట్టుకుంది. కానీ, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ఆమె 'కొమరం పులి'లో నటించడానికి మొదట ఇష్టపడలేదట. దర్శకుడు ఎస్‌జే సూర్య ఒత్తిడి చేయడం వల్లే ఒప్పుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలియజేసింది. 
 
'ఓ బాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇద్దామనుకున్నా. నాకు ప్రాంతీయ సినిమాల్లో నటించడం ఇష్టమే లేదు. కానీ దర్శకుడు ఎస్‌జే సూర్య నన్ను బలవంతపెట్టి 'కొమరం పులి'లో నటింపజేశాడు. అది పరాజయం పాలవడంతో ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అలా చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవకాశాలు వస్తున్నాయ'ని నికిషా తన మనసులోని మాటను వ్యక్తం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో రూ.13.9 కోట్ల విలువైన 13.9 కిలోల హైడ్రోపోనిక్ పట్టివేత

UP: 15 రోజుల నవజాత శిశువును రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన 23 ఏళ్ల మహిళ.. ఎక్కడ?

గాఢ నిద్రలో వున్న భర్త గొంతు పిసికి మర్మాంగాలపై దాడి చేసిన భార్య, ఎందుకంటే?

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments