Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ రూ.15 కోట్లు.. కలెక్షన్లు రూ.25 కోట్లు... ఆ హీరో - దర్శకుడికి వాటాల్లో లాభాలు!

సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:56 IST)
సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ.16 కోట్లు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించింది.
 
ముఖ్యంగా, కథా.. కథనాలతో పాటు రానా పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయవిహారం చేసేసింది. అంచనాలకి మించి భారీ వసూళ్లను రాబట్టేసింది.
 
దాంతో ఈ సినిమాకి ఇప్పటికే రూ.25 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం లాభాల్లో వాటాగా దర్శకుడు తేజకు.. హీరో రానాకు చెరో రూ.5 కోట్లు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. 
 
లాభాల్లో వాటా సంగతి అటుంచితే తేజ .. రానాల కెరియర్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి' నిలిచిపోయిందనే విషయం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments