Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బెడ్ రూమ్, బాత్రూమ్ షేర్ చేసుకోవాలంటే.. నేహా ధూపియా

బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా పెళ్లంటే భయపడుతోంది. తనకిప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది. 'నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడం అంటే యుద్ధానికి వెళ్లడమేనని

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (08:55 IST)
బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా పెళ్లంటే భయపడుతోంది. తనకిప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది. 'నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే, పెళ్లి చేసుకోవడం అంటే యుద్ధానికి వెళ్లడమేనని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే నేను ఒంటరి దానినే' అని స్పష్టంగా చెప్పింది. నిజానికి జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన భయాందోళనలు వెంటాడుతుండటం సాధారణం. మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకుని కొత్త వారితో జీవితం పంచుకోవాలంటే చాలామందిని చాలా రకాలుగా ఏదో తెలియని బిడియం, భయం వెంటాడుతుంటాయి. 
 
అలాగే బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియాని కూడా ఓ రకమైన మానసిక ఆందోళన వేధిస్తోందట. ప్రస్తుతం ఓ మ్యూజిక్ యాప్ కోసం ఓ ఆడియో ప్రోగ్రాంకి హోస్టింగ్ చేయనున్న నేహా తాజాగా మీడియాతో మాట్లాడింది. ''సోనమ్ కపూర్, రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరణ్ జోహర్ వంటి సినీప్రముఖులు ఈ ప్రోగ్రామ్‌లో మనసు విప్పి మాట్లాడబోతున్నారు అంటూ ఆ ప్రోగ్రాం గురించి చెబుతూ తన పెళ్లి విషయాన్ని సైతం ముచ్చటించింది.
 
"తనకి 25-26 ఏళ్లున్నప్పుడు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అందరూ అడిగేవారు. కానీ నేనిప్పుడు 30 వయసులో వున్నాను. ఇక నేను పెళ్లి చేసుకోనేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్లంతా. కానీ నేను కొంచెం పారానాయిడ్ రకం. మరొక వ్యక్తితో నా బెడ్ రూమ్, బాత్రూమ్ షేర్ చేసుకోవాలంటే అంత సౌకర్యంగా ఫీలవను. అలా సౌకర్యంగా నేను ఫీలయ్యే వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను" అని వెల్లడించింది.

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments