Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ఎప్పుడంటే?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (17:19 IST)
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించి బాలీవుడ్‌లో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రణ్‌బీర్, అలియా భట్‌లిద్దరూ 2017 నుంచి ప్రేమలో వున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. 
 
ఈ ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారని తాజాగా మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. రణ్‌బీర్-ఆలియా పెళ్లికి సంబంధించిన కార్యక్రమం కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
అయితే ఈ ఏడాది వీరి పెళ్లి ఉండదని సమాచారం. వచ్చే ఏడాది ద్వితాయర్థంలో వీరి పెళ్లి ఉండొచ్చని సమాచారం. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఈ ఇద్దరికీ లేదట. రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించిన సంగతి తెలిసిందే.
 
కాగా.. అలియా భట్ రణ్‌బీర్ కుటుంబంతో బాగా క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషి కపూర్ మరణించిన తర్వాత రణ్‌బీర్ కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ఇకపోతే.. రణబీర్, అలియా తొలి చిత్రం బ్రహ్మాస్త్రా డిసెంబర్ 4న విడుదల కానుంది.
 
అయినప్పటికీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం వుంది. అలాగే అలియా మరో సినిమాలోనూ నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ క్రైమ్ డ్రామా గంగూబాయిలో అలియా భట్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అలియా భట్ మాఫియా రాణిగా నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments