Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార ఆఫర్‌ను గద్దలా తన్నుకెళ్లిన 'గద్దలకొండ' భామ పూజా హెగ్దె (video)

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:36 IST)
పూజా హెగ్దె. ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఈ పొడుగుకాళ్ల సుందరి తన సెక్సీ లుక్స్‌తో టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఇపుడు ఎవరు చిత్రం చేయాలన్నా తాము పూజా హెగ్దెను ఎంపిక చేసుకుంటున్నారు.

దీనికి కారణం పూజా వర్క్ హార్డ్, భేషజాలకు పోని తత్వం, పైగా రెమ్యూనరేషన్ విషయంలో మంకు పట్టు అనేది లేకపోవడం, ఇంకా చిత్రం ప్రమోషన్ అంటే ఎక్కడికైనా వచ్చేయడం. ఇవన్నీ కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్దెను టాప్ హీరోయిన్ చేసేశాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు-బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో తొలుత నయనతారను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ సైరా చిత్రం విషయంలో నయనతార మంకుపట్టి పట్టి అలాగే కూర్చుండిపోవడంతో ఆమెను తీసుకోవడం వేస్ట్ అనీ, ఆమె కంటే పూజా హెగ్దె బెస్ట్ అని అనుకుంటున్నారట. 
 
ఇదే కనుక నిజమైతే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా పూజా కాలమే. ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సరసన చిత్రాలు చేస్తూ బిజీగా వుంది పూజా. ఇక పవన్ కల్యాణ్ చిత్రంలో కూడా నటిస్తే, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు వరసబెట్టి విడుదలవుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం