Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్లు పట్టుకున్న నయనతార - హన్సిక : ప్రేక్షకుడిలా చూస్తుండిపోయిన విఘ్నేష్

సూర్య హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల గుసగుసలు వినిపించాయి. నయనతార, విజయ్‌ 'సేతుపతి' జంటగా విఘ్నేష్‌ దర్శకత్వంలో విడుదలైన 'నేనూ రౌడీనే' చిత్రం నచ్చి సూర్య ఆయన దర్శకత్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:00 IST)
హీరోగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల గుసగుసలు వినిపించాయి. నయనతార, విజయ్‌ 'సేతుపతి' జంటగా విఘ్నేష్‌ దర్శకత్వంలో విడుదలైన 'నేనూ రౌడీనే' చిత్రం నచ్చి సూర్య ఆయన దర్శకత్వంలో నటించాలని భావించినట్లు వార్తలు వినిపించాయి. అయితే వీటిని నిజం చేస్తూ.. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ట్వీట్‌ చేశారు. సూర్యతో సినిమా తీయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి, స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారని తెలిపారు. 
 
దీనిపై సూర్య రీట్వీట్‌ చేస్తూ.. గుర్తుండిపోయే చిత్రాన్ని తీద్దామన్నారు. ఇదిలావుంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా న‌య‌న‌తారే తీసుకోవాల‌ని విఘ్నేష్ సూర్య వ‌ద్ద ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. అయితే సూర్య మాత్రం న‌య‌న‌ను కాద‌ని హ‌న్సిక‌ను తీసుకోవాల‌ని చెప్ప‌డంతో విఘ్నేష్ షాక్ అయిన‌ట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ఒక హీరోయిన్‌ కాగా, మరో హీరోయిన్‌ కోసం నయనతార, హన్సికల మధ్య పోటీ నెలకొంది. ఈ సినిమాలో నయనతారను ఎంపిక చేశారన్న వార్తలు కూడా ఆ మధ్య కోలీవుడ్‌లో వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం హన్సికకే దక్కిందని అంటున్నారు. నయనతార, హన్సికలతో గతంలో సూర్య సినిమాలు చేసినా ఈ సినిమాకు మాత్రం హన్సికకే తన ఓటు వేయడంతో విఘ్నేష్ మౌనం వ‌హించ‌క త‌ప్ప‌లేద‌ట‌. కాగా సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'సింగం-3' చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments