Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు రూ.కోట్లు చెల్లిస్తున్న తమిళ నిర్మాతలు... ఎందుకు? (video)

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (10:59 IST)
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్రహీరోయిన్‌గా ఉన్న నటి నయనతార. ఈ మలయాళ భామకు తమిళ నిర్మాతలు కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నారు. దీనికి కారణం ఆమె మార్కెట్టేనట. ఆమె తమ సినిమాల్లో నటించడాన్ని గొప్పగా భావిస్తున్నారు. పైగా, నయన్ నటించిన చిత్రాల ప్రమోషన్‌కు రాకపోయినా ఫర్లేదు అనే ధోరణితో తమిళ నిర్మాతలు ఉంటున్నారు. అంతేనా.. నయన్ పెట్టే అన్ని రకాల కండీషన్లను కూడా వారు సమ్మతిస్తున్నారట. 
 
ఇంతకీ నయనతారకు అంతలా డిమాండ్ ఏర్పడటానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈమె ఓ చిత్రానికి రూ.4 నుంచి రూ.6 కోట్ల మేరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. కథ నచ్చడం, కాస్త తెలిసిన క్రూ అయితే కాస్త తక్కువ రెమ్యునరేషన్‌.. డిమాండ్‌ను బట్టి ఎక్కువ రెమ్యునరేషన్‌ అడుగుతుంటుంది. 
 
అంతే కాదండోయ్‌. ఇంత రెమ్యునరేషన్ ఇచ్చినా ప్రమోషన్స్‌కు మాత్రం రాదు. ఇన్ని కండీషన్స్ ఉన్నా నయనతారకు ఉన్న మార్కెట్‌ను అనుసరించి నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అంటుంటారు. అదే పంథాలో ఇప్పుడు నయనతార రీసెంట్‌గా విడుదలైన 'అమ్మోరుతల్లి' సినిమాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్‌ చేసిందట. 
 
నటుడు ఆర్‌.జె.బాలాజీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాకి అన్ని విధాల నయనతారే హైలైట్ కావటంతో ఆమె అడిగినంతా రెమ్యూనరేషన్ ఇచ్చారట నిర్మాతలు. ఇందులో నిజమెంతో మనం చెప్పలేం కానీ తమిళనాట స్టార్ హీరోల మాదిరిగానే... నయన్‌కి కూడా ఇప్పుడు గట్టి బ్రాండ్ వాల్యూ ఉంది. 
 
ఆమె మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కోట్లు చెల్లించుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఇస్తున్నారో... అందుకు తగ్గట్టుగానే తెలుగు, తమిళ భాషల్లో... రిటర్న్స్ ఉంటున్నాయట! ఫిల్మ్ మేకర్స్‌కి అంతకంటే కావాల్సింది ఏముంటుంది మరి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments