Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌‍కు మూడు సెటప్ రెఢీ... ఇక దున్నేయడమే ఆలస్యం...!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడో సెటప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆమెతో ఆడిపాడటమే మిగిలివుందట. ఇంతకీ మూడో సెటప్ అంటే.. మరోలా అర్థం చేసుకోవద్దండీ. తన కొత్తచిత్రం కోసం మూడో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:35 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మూడో సెటప్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆమెతో ఆడిపాడటమే మిగిలివుందట. ఇంతకీ మూడో సెటప్ అంటే.. మరోలా అర్థం చేసుకోవద్దండీ. తన కొత్తచిత్రం కోసం మూడో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నాడన్నమాట. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రం "జై లవ కుశ" తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మనసుపడి మరీ ఎంచుకొన్న కథ ఇది. 
 
ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. అందుకు తగ్గట్టుగానే ముగ్గురు హీరోయిన్స్ తీసుకోవాలనుకొన్నారు. ఇప్పటికే రాశీఖన్నా, నివేదా థామస్‌లని ఎంపిక చేసుకోగా, ఇపుడు మూడో హీరోయిన్‌ను కూడా సెలెక్ట్ చేశాడు. నిజానికి మూడో హీరోయిన్‌గా ఓ స్టార్ హీరోయిన్ చేత గెస్ట్ రోల్ చేయించాలని అనుకున్నారు. కానీ, ఇపుడు స్టార్ హీరోయిన్ స్థానంలో యంగ్ హీరోయిన్ నందితని తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
'ప్రేమకథా చిత్రమ్'లో తన నటనను నందిత బహిర్గతం చేసింది. ఆ తర్వాత చేసిన సినిమాలు నందితకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే, ఇప్పుడు నందిత పేరు ఎన్టీఆర్ 'జై లవ కుశ' కోసం వినిపిస్తుండటంతో.. ఆమె మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ వార్తలు నిజమైతే ఆమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments