Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు సన్నివేశాలపై నందితా శ్వేత కామెంట్స్: నేను ఆ వ్యాధితో..? (video)

Webdunia
బుధవారం, 19 జులై 2023 (09:18 IST)
తెలుగు, తమిళ భాషల్లో నటించిన నందితా శ్వేత దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నందితా శ్వేత. ఆ మధ్య నందితా శ్వేత కూడా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 
 
ఢీ 14 డ్యాన్స్ షోలో నందిత న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఆమె ‘హిడింబ’లో కనిపించనుంది. ఈ సినిమాలో నందితా శ్వేత, అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరూ పోలీసు అధికారులుగా కనిపించడం విశేషం. జూలై 20న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నందితా శ్వేత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 
 
ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించడం వల్ల బరువు తగ్గేందుకు ఇబ్బంది పడ్డానని నందిత తెలిపింది. బరువు తగ్గడం కష్టమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే నందిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలిస్తే ఆమె బరువు తగ్గడం ఎంత కష్టమో అర్థమవుతుంది. 
 
"నాకు ఫైబ్రోమైయాల్జియా ఉంది. నేను కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నాను. ఈ వ్యాధి కారణంగా కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కండరాల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని అనుసరించడం చాలా కష్టం." అంటూ నందితా శ్వేత వెల్లడించింది.
 
అలాగే లిప్ లాక్ గురించి నందితా శ్వేత మాట్లాడుతూ.. సాధారణంగా నేను రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ కిస్‌లకు దూరంగా ఉంటాను. అయితే ఈసారి కథ పరంగా ముద్దుల సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. ట్రైలర్‌లోనే నందిత, అశ్విన్‌ల మధ్య ఘాటైన లిప్ లాక్ కనిపించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments