Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోతో విలన్‌గా నందమూరి తారక్.. అదే జరిగితే టాప్ రేంజ్‌కు తారక్!?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (14:28 IST)
''ఒకటో నెంబర్ కుర్రాడు'' చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు నందమూరి తారకరత్న. ఈ నందమూరి హీరో తరువాత సరైన హిట్లు లేక వెనకపడ్డాడు. వరుసగా 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన తారకరత్నఆ తరువాత అసలు సినిమాలే చేయకుండా కనుమరుగయ్యాడు. ఇదిలా ఉంటే నందమూరి తారకరత్న.. ఇప్పుడు సూపర్ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 
 
హీరోగా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా విలన్‌గా మార్కులు కొట్టేశాడు. గతంలో ''అమరావతి'' చిత్రంలో విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా రిలీజైన ''రాజా చెయ్యి వేస్తే''లోనూ విలన్‌గా ఇరగదీశాడు. ''రాజా చెయ్యి వేస్తే''లో హీరో పాత్రకంటే విలన్ పాత్రకే మంచి గుర్తింపు వస్తోంది. ఈ క్రమంలో తారకరత్నకు విలన్ రోల్ చేయాలంటూ మరో ఆఫర్ వచ్చిందట. 
 
గోపిచంద్ మలినేని, సాయి ధరం తేజ్ కాంబోలో రాబోతున్న చిత్రానికి విలన్‌గా తారకరత్నను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారట. మెగా కుటుంబంతో ఉన్న బంధుత్వం కోసం నందమూరి తారకరత్న విలన్‌గా మారాలనుకుంటున్నాడు. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాని తారక్ ఓకే చేస్తే రీ ఎంట్రీ టైంలో నందమూరి హీరో టాప్ రేంజ్‌లో వెళ్తాడనడంలో సందేహం లేదు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments